Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ పాప్యులారిటీ పెరగాలంటే... ఏం చేయాలో చెప్పిన శివసేన

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ అఖండ విజయాన్ని సాధించారు. దేశంలో 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై దేశ ప్రజలే కాక విదేశాలు కూడా మోదీ సత్తాను వేనోళ్ల చాటాయి. అమెరికా లాంటి అగ్ర దేశం కూడా భారత్ లో మూడు దశాబ్దాల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని వ్యాఖ్యానించి మోదీ సత్తాను గుర్తించింది. అయితే మోదీ ప్రధానిగా పదవి చేపట్టి ఇప్పటికే ఏడాదిన్నర అయిపోయింది. ఈ క్రమంలో పలు పొగడ్తలతో పాటు తెగడ్తలను కూడా మోదీ ఎదుర్కోవాల్సి వచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, మొన్నటి గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలు మోదీకి తగ్గిన పాప్యులారిటీని తేటతెల్లం చేశాయి. తగ్గుతున్న పాప్యులారిటీని పెంచుకునేందుకు బీజేపీ మిత్రపక్షం, మరాఠా పార్టీ శివసేన ఓ చక్కటి సలహాను మోదీకి సూచించింది. రామ మందిరం నిర్మాణాన్ని తన భుజస్కందాలపై వేసుకుంటే మోదీ పాప్యులారిటీ రెట్టింపేమిటి, కొన్ని రెట్లు పెరిగిపోతుందని ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. మరి మోదీ శివసేన సూచనను స్వీకరిస్తారో, తిరస్కరిస్తారో చూడాలి.

More Telugu News